Prabhu Yesu Naa Kai – ప్రభుయేసు నాకై
Prabhu Yesu Naa Kai – ప్రభుయేసు నాకై
Prabhu Yesu Naa Kai
ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి
ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై
1.శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై
స్వామి నా పాపముల కొరకే
సహింపజాలని వేదన బహుగా
సహించితివి ప్రేమతోడ
2.కాళ్ళు చేతులలో మేకులు కొట్టిరి
బల్లెముతో ప్రకన్ బొడిచిరి
యేలాగు వివరింతు నీ బాధ నేను
ఓర్చితివా మౌనము వహించి
3.ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమా
ఎందు కింతగా ప్రేమించితివి
వందన మర్పింతు నీ పాదములకే
పొందుగ నీ వాడనైతి